ఎన్నికల హామీలు నెరవేరుస్తున్నాం

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేస్తున్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పాలమూరు పార్లమెంట్  న్యాయయాత్రలో భాగంగా సోమవారం రూరల్ మండలం కోటకద్ర, రామచంద్రాపురం, మాచన్​పల్లి గ్రామాల్లో జరిగిన సభలో సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్​రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల్లో  భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, 200  యూనిట్ల వరకు ఉచిత విద్యుత్

రూ.500 గ్యాస్​ సిలిండర్  అందించామని, ఈ నెల 11 నుంచి ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని తెలిపారు. 3 నెలల్లో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. ప్రజాపాలన పేరుతో వివరాలు సేకరించామని, అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్  పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

వంశీ చంద్​రెడ్డి మాట్లాడుతూ మహబూబ్​నగర్ తో పాటు 17 ఎంపీ సీట్లు కాంగ్రెస్  పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు మన్నెంకొండ అలివేలి మంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎన్పీ వెంకటేశ్, బెక్కరి అనిత, సాయిబాబా, సత్తూర్  చంద్రకుమార్ గౌడ్, ఆనంద్ గౌడ్, మల్లు నర్సింహారెడ్డి, సుధాకర్ రెడ్డి, లక్ష్మణ్ యాదవ్, శేఖర్ నాయక్,   మోహన్ రెడ్డి, చంద్రశేఖర్, నర్సింహారెడ్డి, ప్రతాప్ రెడ్డి, మల్లు అనిల్ రెడ్డి, గురునాథ్ రెడ్డి పాల్గొన్నారు.

కాంగ్రెస్ లో చేరికలు

హన్వాడ, వెలుగు : పాలమూరు పార్లమెంటు న్యాయ యాత్రలో భాగంగా సోమవారం హన్వాడ మండలం పెద్దదర్పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్  నాయకులు, కార్యకర్తలు మహబూబ్ నగర్  ఎమ్యెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్​రెడ్డి సమక్షంలో కాంగ్రెస్  పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్  కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే పార్లమెంట్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మారేపల్లి సురేందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, యాదయ్య గౌడ్ , రామస్వామి గౌడ్, భీమేశ్ గౌడ్, చంద్రశేఖర్, మేకల శివ, పోతన్ పల్లి మోహన్ రెడ్డి పాల్గొన్నారు.