పాలమూరు అభివృద్ధి ఆగకుండా చూడాలి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డి

పాలమూరు, వెలుగు: పాలమూరును అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని, పార్టీలకతీతంగా ప్రతి వార్డుకు నిధులు కేటాయించి డెవలప్​ చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలోని ఎంవీఎస్  కాలేజీ గ్రౌండ్​లో శ్రమదానం నిర్వహించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొని అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు. ఎమ్మెల్యేకు పలువురు విద్యానిధి విరాళాలు అందజేశారు. విజన్  గార్డెన్ లో  ఆర్ఎంపీ డాక్టర్ల క్యాలెండర్ ను  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహబూబ్ నగర్  పట్టణంలో అభివృద్ధి ఆగకుండా చూడాలని అధికారులకు సూచించారు.

ప్రజలు, అధికారుల మధ్య సరైన అవగాహన ఉంటే ఏ సమస్య రాదని చెప్పారు. పాలమూరును అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలనే తపనతో ఉండాలని, అధికారులు తప్పులు చేస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. మున్సిపల్  చైర్మన్  ఆనంద్ గౌడ్, ముడా చైర్మన్  లక్ష్మణ్  యాదవ్, మార్కెట్  కమిటీ చైర్మన్  బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి, కౌన్సిలర్  ప్రశాంత్, డీసీసీ జనరల్​ సెక్రటరీ సిరాజ్ ఖాద్రి, సాయిబాబా, అజత్ అలీ, ఫయాజ్  పాల్గొన్నారు.