విద్యార్థులకు యూనిఫామ్​ల పంపిణీ : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

 మహబూబ్ నగర్ రూరల్​ , వెలుగు :  రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ పై నిబద్ధతతో పనిచేస్తుందని ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి  అన్నారు.  మహబూబ్ నగర్ రూరల్ మండలంలోని ఫత్తేపూర్ క్లస్టర్ 3లో   అంగన్​వాడీ విద్యార్థులకు  శుక్రవారం స్కూల్ యూనిఫామ్స్ ను పంపిణీ చేశారు.  ఈ సంవత్సరం నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ కూడా అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు పండరినాథ్ , భాస్కర్, నరేశ్​ గౌడ్, శ్రీనివాస్ యాదవ్ ఎంపీడీఓ కరుణ శ్రీ, తదితరులు పాల్గొన్నారు.