సోదర భావంతో మెలగాలి : యెన్నం శ్రీనివాస్ రెడ్డి

పాలమూరు, వెలుగు: కులాలు, మతాలకతీతంగా సోదర భావంతో ఉండాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని హనుమాన్ పుర యూనిక్  ఫంక్షన్  హాల్ లో షేర్ కుమార్  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్  విందులో కాంగ్రెస్  ఎంపీ క్యాండిడేట్​ వంశీచంద్ రెడ్డి, ఎన్పీ వెంకటేశ్, మారేపల్లి సురేందర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లింలకు పండ్లను తినిపించారు. ఫయాజ్, రాఘవేందర్, సిరాజ్ ఖాద్రి, లక్ష్మణ్ యాదవ్, నసీర్ మున్సబ్, జహీర్  పాల్గొన్నారు.