సింహగర్జన పోస్టర్లను ఆవిష్కరించిన చెన్నూరు ఎమ్మెల్యే

సంగారెడ్డి టౌన్, వెలుగు: డిసెంబర్​1న నిర్వహించే సింహగర్జన వాల్​పోస్టర్లను గురువారం సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హైదరాబాద్​లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాలల ఆత్మ గౌరవాన్ని ఈ సమాజానికి చాటి చెప్పాలని, అన్ని జిల్లాల నుంచి మాలలు ఎక్కువ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

అంబేద్కర్ సేవా సమితి అధ్యక్షుడు జగన్, జిల్లా డివిజన్ అధ్యక్షుడు అశోక్, దుర్గాప్రసాద్, సాగర్, సురేశ్, ప్రమోద్, పురుషోత్తం, ఉదయ్, వెంకటేశ్, తరుణ్ పాల్గొన్నారు.