చెన్నూరులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వివేక్

మంచిర్యాల జిల్లా:   చెన్నూరు నియోజకవర్గంలో  పలు అభివృద్ధి పనులకు ఇవాళ శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మౌలిక సదుపాయాల కల్పన కోసం మూడు కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. క్యాతనపల్లి రెండవ వార్డ్ జ్యోతి నగర్ లో 30 లక్షలతో నిర్మించనున్న సైడ్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేశారు. భరత్ నగర్ లో 60 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజ్ నిర్మాణ పనులు,  వీఆర్ కన్వెన్షన్ పరిధిలో 49 లక్షలతో సైడ్ డ్రైనేజ్ పనులు, అమ్మ గార్డెన్ లో 94 సైడ్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు  ఇవాళ శంకుస్థాపన చేశారు. ఆగస్టు 4న ఒకే రోజు  రెండు కోట్ల 33 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అభివృద్ధి పనుల పట్ల స్థానికులు  హర్షం వ్యక్తం చేస్తున్నారు., సందర్భంగా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

క్యాతనపల్లి మున్సిపాలిటీలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.అనంతరం మందమర్రి ఏరియా సింగరేణి జిఎంతో కలిసి విద్యార్థులు స్కూల్ స్టాప్ తో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్కూల్లో కిచెన్, టాయిలెట్స్, సరిపోవడంలేదని భవనం రూఫ్ పగిలిపోవడంతో వర్షపు నీరు క్లాస్ రూముల్లోకి రావడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు విద్యార్థులు.దీంతో వెంటనే స్పందంచిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి 20 లక్షల రూపాయలతో డిఎంఎఫ్టి నిధులతో అభివృద్ధి పనులు చేపడుతామని  హామీ ఇచ్చారు. వర్షాకాలం తర్వాత టాయిలెట్స్, భవనం పైకప్పు రిపేర్ పనులు ప్రారంభిస్తాని తెలిపారు.