చెన్నూరులో రూ.100కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నయ్ : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

చెన్నూర్ నియోజకవర్గంలో రూ.100 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా బీమారం మండలంలో108 వాహనాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ప్రారంభించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  ఈ సందర్భంగా మాట్లాడిన వివేక్.. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ చక్కదిద్దానని చెప్పారు.  ఇక్కడ జోడు వాగులు రోడ్డు మరమ్మత్తులు చేశామన్నారు. 

మిషన్ భగీరథ నీళ్ళు రావడం లేదని..  అమృత్ పథకం ద్వారా నీళ్లను అందిస్తున్నామని తెలిపారు వివేక్.  108 వాహనం లేదని ప్రజలు అడిగితే  కలెక్టర్ తో అంబులెన్స్ ఏర్పాటు చేశానన్నారు. తాను ఇక్కడ విద్య, వైద్యం పైన దృష్టి పెట్టి  అభివృద్ధి పనులు చేస్తున్నట్లు చెప్పారు.

ALSO READ | ప్రజల మధ్య విభజన రేఖలు తెచ్చేలా బీజేపీ కుట్ర: విజయ శాంతి

చెన్నూరులో 100 పడకల ఆసుపత్రి అవసరం ఉందన్నారు ఎమ్మెల్యే వివేక్. దీనిపై ఇప్పటికే  వైద్య శాఖ మంత్రితో  మాట్లాడినట్లు చెప్పారు. సోమనపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయని చెప్పారు వివేక్.