చెన్నూరు ఆర్టీసీ డిపోకు నిధులివ్వండి : ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

  • అసెంబ్లీ క్వశ్చన్​ అవర్​లో  ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు: చెన్నూరు ఆర్టీసీ డిపోకు నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి  కోరారు. మంగళవారం అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ ​సందర్భంగా ఆయన మాట్లాడారు. చెన్నూరుకు  మూడు రాష్ట్రాలు బార్డర్​గా ఉన్నాయని, అందుకే ఇక్కడ బస్ డిపో అవసరమని పేర్కొన్నారు. గతంలో రోడ్లు అస్తవ్యస్తంగా ఉండగా.. తాను ఎంపీగా ఉన్న ప్పుడు  రూ.15 కోట్ల నిధులు మంజూరు చేశానన్నారు.

అలాగే, ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత రూ.2 కోట్లు మంజురు చేశానని తెలిపారు. చెన్నూరు డిపో ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని కోరారు. అలాగే, హైదరాబాద్ నుంచి ఆర్టీసీ బస్ సర్వీసులను పెంచాలన్నారు. మంచిర్యాల – చెన్నూరు వయా బీమారం బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని కోరారు. చెన్నూరు నుంచి ఉద యం 5.30 గంటలకు హైదరాబాద్​కు బస్​ నడపాలని కోరారు. అలాగే, ఆసీఫాబాద్​ నుంచి హైదరాబాద్​ వెళ్లే బస్సులకు మందమర్రిలో స్టాప్​ ఏర్పాటు చేయాలన్నారు.