తరుణ్ కుమార్ మెహతాకు గోరత్న అవార్డు

  • అతిథిగా పాల్గొని అందజేసిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

బషీర్ బాగ్, వెలుగు: ఎన్నో ఏండ్లుగా గో సేవ చేస్తున్న సామాజిక వేత్త తరుణ్ కుమార్ మెహతాకు ‘గో రత్న పురస్కారం–2024’ లభించింది. సోమవారం కాచిగూడలోని పటేల్ ఘన్ శ్యామ్ భవన్ లో తరుణ్ కుమార్ మెహతా 75 జన్మదిన వేడుకలు జరిగాయి. అతిథిగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొని లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ చైర్మన్ జస్మత్ పటేల్, సాధు సంతువులు, పీఠాధిపతులతో కలిసి తరుణ్​కుమార్​ మెహతాకు ‘గో రత్న’ అవార్డు అందజేశారు. 

ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు గోమాతకు వివేక్ వెంకటస్వామి హారతి ఇచ్చారు. లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ ట్రస్టీగా తరుణ్ మెహతా గోవుల  సంరక్షణకు ఎంతో కృషి చేశారని, ఆయనకు గో రత్న అవార్డు లభించడం ఆనందంగా ఉందని జస్మత్ పటేల్ అన్నారు.