నాగర్ కర్నూల్లో మాలల ఆత్మగౌరవ సభ.. పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

నాగర్ కర్నూ్ల్ లో మాలల ఆత్మగౌరవ సభ జరిగింది. ఆదివారం ( అక్టోబర్ 27) సాయంత్రం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ సభకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, భారీ ఎత్తున మాలలు హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా  ఎస్సీ రిజర్వేషన్ పోరాట కమిటీ ఆధ్వర్యంలో మాలల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. 

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుతో ఇప్పించిన తీర్పును వ్యతిరేకిస్తున్నట్లు వక్తలు తెలిపారు. 341 ఆర్టికల్ ద్వారా పార్లమెంటులో బిల్లు సవరణ చేసి బిల్లు పెట్టి పాస్ చేసిన తర్వాతే వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాలు చేసే వర్గీకరణ తమకొద్దని స్పష్టం చేశారు.