కోల్‌బెల్ట్, వెలుగు: మందమర్రి పట్టణానికి చెందిన ఆకారం రమేశ్‌ను కాంగ్రెస్‌పార్టీ ఎస్సీ సెల్ స్టేట్కన్వీనర్గా నియమిస్తూ ఆ సెల్ స్టేట్ చైర్మన్నగరిగారి ప్రీతమ్ మంగళవారం ప్రకటించారు. 20 ఏండ్లుగా కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తున్న రమేశ్.. ఎన్ఎస్యూఐ, యుత్ కాంగ్రెస్‌లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో పలు హోదాల్లో పనిచేశారు.
ఈ మేరకు రమేశ్‌ను అభినందిస్తూ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఎస్సీ సెల్కన్వీనర్ ఉత్తర్వులను అందజేశారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు వివేక్, గడ్డం వినోద్సహకారంతోనే ఈ పదవి దక్కిందని రమేశ్ పేర్కొన్నారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు. దళితుల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.