తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది:ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు.నేను రాజకీయాల్లోకి వచ్చాక తెలుగు స్పష్టంగా నేర్చు కున్నారు..అప్పుడే నాకు తెలుగు భాష ప్రాముఖ్యత అర్థమయిందన్నారు ప్రతిఒక్కరూ తెలుగు భాషా ఉన్నతికి కృషి చేయాలన్నారు వివేక్ వెంటకస్వామి. 

మా వ్యాపారంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారు సహకరిస్తున్నారు..తెలుగు మహాసభలకు హాజరైన తెలుగు వ్యాపార వేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అభివృద్దికి తోడ్పడాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోరారు. 

మరోవైపు తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.. ఆయన కుటుంబ సభ్యులంతా తెలుగు మాట్లాడటం తప్పని సరి చేసినట్లు చెప్పారు. నా మనవళ్లు, మనవరాళ్లకు తెలుగు ఖచ్చితంగా మాట్లాడాలని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు వివేక్ వెంకటస్వామి.    

ప్రపంచ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో హైదరాబాద్ లో హెచ్ ఐసీసీ నోవాటెల్ లో శుక్రవారం (జనవరి 3, 2025) ప్రారంభమయ్యాయి.. మూడు రోజుల పాటు కొనసాగిన ఈ తెలుగు మహాసభల్లో ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉంటున్న తెలుగు ప్రముఖులు, కవులు, సినినటులు, రచయితలు, తెలుగు భాషాభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 

తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మె్ల్యే వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. వీరితోపాటు సినీ నటులు  జయ సుధా , జయ ప్రధ , మురళి మోహన్ , సాయి కుమార్, నిర్మాత అశ్విని దత్ వంటి సినీ ప్రముఖులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సినీ ప్రముఖులకు సన్మానకార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలు, సంక్రాంతి సంబురాలు అందరిని అలరించాయి.