మాలల జనాభాపై అవాస్తవాలు మాట్లాడుతున్నారు:ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

నాగర్ కర్పూల్:మాలల జనాభా తక్కువగా ఉందని  కొంతమంది అవాస్తవాలు మాట్లాడుతున్నారు. జాతి కోసం కోట్లాడాల్సిన, సత్తా చూపించాల్సిన అవసరం వచ్చిందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది మాలలు ఉన్నారు.. మాలల జనాభాపై సీఎం రేవంత్ రెడ్డికి వివరాలు అందించామన్నారు. 

మాలల ఆత్మగౌరవం కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు వివేక్ వెంకటస్వామి. రాజకీయ పార్టీలు మాలలను చిన్న చూపు చూస్తున్నాయన్నారు. ఇందిరా గాంధీ కాలం నుంచి మాలలు కాంగ్రెస్ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. 

ALSO READ | నాగర్ కర్నూల్లో మాలల ఆత్మగౌరవ సభ.. పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

నవంబర్ 24న హైదరాబాద్ లో జరిగే మాలల సభలో పెద్ద ఎత్తున పాల్గొని సత్తాచాటాలన్నారు. మాల జాతిపై విమర్శలు చేస్తూ ఊరుకునేది లేదన్నారు. కాకా వెంకటస్వామి కుల మతాల కతీతంగా 75 వేల గుడిసెలు ఇప్పించారు. మాల కులం గొప్పతనం ప్రపంచానికి తెలపాల్సిన అవసరం ఉందన్నారు. 

నాగర్ కర్నూల్  జిల్లాకేంద్రంలో ఆదివారం (అక్టోబర్ 27) సాయంత్రం మాలల ఆత్మగౌరవ సభ జరిగింది. ఈ సభలో మాలలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొత్త జనాభా గణన చేపట్టిన తర్వాతే ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని, ఎస్సీ ఉప కులాలకు సైతం మేలు చేయాలని, రిజర్వేషన్లు పెంచి అన్ని వర్గాలకు న్యాయం చేయాలని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు.