కోల్ బెల్ట్/జైపూర్/కోటపల్లి/బెల్లంపల్లి/ఆదిలాబాద్/ఖానాపూర్, వెలుగు : చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కృషి చేస్తున్నారని కాంగ్రెస్ లీడర్లు పేర్కొన్నారు. శనివారం చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి బర్త్‌డేను మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, మాల మహానాడు లీడర్లు, అభిమానులు ఘనంగా నిర్వహించారు.
మందమర్రి, క్యాతనపల్లి, భీమారం, జైపూర్, చెన్నూరు, కోటపల్లి, ఖానాపూర్, ఆదిలాబాద్, మంచిర్యాల మండలాల్లోని గ్రామాలు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు కేక్‌లు కట్ చేసి సంబురాలు జరిపారు.