దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి : విజయుడు

అలంపూర్, వెలుగు : దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని అలంపూర్  ఎమ్మెల్యే విజయుడు కోరారు. జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అక్టోబర్  3 నుంచి 12 వరకు నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను సోమవారం ఆలయం ఆవరణలో రిలీజ్​ చేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా సౌలతులు కల్పించాలని ఈవో పురేందర్ కుమార్ కు సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ, ఆలయ మాజీ చైర్మన్  చిన్న కృష్ణయ్య పాల్గొన్నారు.