అలంపూర్ చౌరస్తాలో .. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

అలంపూర్,వెలుగు : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీమూబారక్ పథకం ఆడపిల్లలకు వరంగా నిలిచిందని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను  గురువారం పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవెల్లి, మానవపాడు, ఎర్రవల్లి, ఇటిక్యాల మండలాలకు చెందిన 178 మంది లబ్ధిదారులకు రూ.1,78,20,648 చెక్కులను పంపిణీ  చేశామన్నారు.  కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ గజేంద్రరెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.