షాద్ నగర్ లో డబుల్ ధమాకా సాధిద్దాం: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్ నగర్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించినట్టుగానే లోక్ సభ ఎన్నికల్లోనూ మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి విజయం అందించాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం కేశంపేట మండలం కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే శంకర్, చల్లా వంశీచంద్ రెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు.  

కార్యకర్తలనుద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ కేశంపేట మండల పార్టీ నేతలు, కార్యకర్తలను గత పదేండ్ల  బీఆర్ఎస్ పాలనలో ఎన్నో ఇబ్బందులు పెట్టారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో అల ఉండదని, ఇచ్చిన హామీని కచ్చితంగా అమలు చేసి అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు. వంశీచంద్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే.. పార్లమెంటులో పాలమూరు వాణి వినిపిస్తారని, సాగు, తాగునీటికి కేంద్ర ప్రభుత్వం ద్వారా పెద్ద ఎత్తున నిధులు తెస్తారని పేర్కొన్నారు.  

లోక్ సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపిస్తే అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని వంశీచంద్ రెడ్డి కోరారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజా పాలన కావాలంటే  కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం పోమాలపల్లి మాజీ సర్పంచ్ కృష్ణయ్య యాదవ్, 160 మంది బీఆర్ ఎస్ నేతలు వంశీచంద్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. వారికి పార్టీ కండువాలను ఎమ్మెల్యే కప్పి ఆహ్వానించారు. ఈ సమావేశంలో ఇన్ చార్జ్ మధుసూదన్ రెడ్డి, ఏపీ మిథున్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గూడ వీరేశం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీష్ అప్ప, శ్రీధర్ రెడ్డి, సురేష్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.