షాద్ నగర్, వెలుగు: కాలుష్య కారక స్పాంజ్ ఐరన్ పరిశ్రమపై న్యాయ పోరాటం చేసి షాద్ నగర్ నియోజకవర్గ రైతులకు మేలు చేసిన సీనియర్ న్యాయవాది తాండ్ర వీరేందర్ రెడ్డిని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అభినందించారు. వీరేందర్ రెడ్డిని శుక్రవారం ఆయనతో పాటు పలువురు ప్రముఖులు సన్మానించారు.
రాజీలేకుండా సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి వీరేందర్రెడ్డి విజయం సాధించారన్నారు. స్పాంజ్ ఐరన్ పరిశ్రమ నిర్వాహకులు ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేసిన మొత్తాన్ని రైతులకు ఇప్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్లో ఎన్ఎస్ యూఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ ప్రతీక అని చెప్పారు.