ఎమ్మెల్యే ఖర్చుతో మధ్యాహ్న భోజనం

షాద్ నగర్, వెలుగు: షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో తన సొంత ఖర్చుతో మధ్యాహ్న భోజన కార్యక్రామన్ని ప్రారంభించారు.

ప్రస్తుతం కాలేజీలో 850 మంది స్టూడెంట్లు చదువుకుంటున్నారు. వారందరికి ఎగ్జామ్స్​వరకు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కల్పిస్తామని తెలిపారు.