షరతులు లేకుండా రూ.2లక్షల రుణమాఫీ : ఎమ్మెల్యే వంశీకృష్ణ 

అచ్చంపేట, వెలుగు: రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. ఎలాంటి షరతులు లేకుండా రూ.2 లక్షల రైతు రుణమాఫీ మార్గదర్శకాలు ఉంటాయని తెలిపారు. అచ్చంపేట పీఏసీఎస్ సమావేశానికి ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రైతు భరోసాకు సంబంధించి రైతుల సలహాలు సూచనలపై చర్చించారు.

నిజమైన రైతులకు లబ్ధి చేకూరేలా రైతు భరోసా పథకం ఉంటుందని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆగస్టు 15 లోపు రుణమాఫీ పూర్తి చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో మండల  పీఏసీఎస్ అధ్యక్షుడు, సింగల్ విండో డైరెక్టర్లు, వ్యవసాయ అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.