మద్దిమడుగు ఆంజనేయ స్వామి ఆలయాన్ని డెవలప్​ చేస్తాం : ఎమ్మెల్యే వంశీకృష్ణ

అమ్రాబాద్, వెలుగు: మద్దిమడుగు పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయాన్ని డెవలప్​ చేసేందుకు తనవంతు సహకారం అందిస్తానని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. పదర మండలం పబ్బతి ఆంజనేయస్వామి ఆలయ పాలకమండలి చైర్మన్, సభ్యులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈవో రంగాచారి, అర్చకులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దేవాదాయ శాఖ డివిజన్  ఇన్స్​పెక్టర్  వెంకటేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ గా దేశావత్  రాములు, సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని, కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణం, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్  రాములు, అచ్చంపేట మున్సిపల్  చైర్మన్  గార్లపాటి శ్రీనివాసులు, గోపాల్ రెడ్డి, హరి నారాయణ గౌడ్, బాల్ లింగం గౌడ్, ముక్రం ఖాన్, తిరుమలయ్య, నరహరి, చిన్న చంద్రయ్య, లింగం, మల్లికార్జున్, అంజి పాల్గొన్నారు.