బస్సు నడిపిన ఎమ్మెల్యే

నర్వ, వెలుగు : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బస్సును ప్రారంభిస్తున్నట్లు మక్తల్  ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలిపారు. సోమవారం మండలంలోని యాంకీ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆత్మకూర్ నుంచి అమరచింత, నాగల్ కడుమూర్, నాగిరెడ్డి పల్లి, యాంకీ, నర్వ, పాతర్చేడ్, రాజుపల్లి

రాయికోడ్ కు వెళ్లే బస్సును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ప్రయాణికుల కోరిక మేరకు కొద్ది దూరం బస్సు నడిపారు. ప్రయాణికులు, విద్యార్థుల కష్టాలు చూసి బస్​ ప్రారంభించినట్లు తెలిపారు.