రోడ్ల నిర్మాణానికి రూ.8.73 కోట్లు శాంక్షన్ : తూడి మేఘారెడ్డి

వనపర్తి, వెలుగు: వనపర్తి నియోజకవర్గంలోని గ్రామాలకు బీటీ రోడ్లు నిర్మించేందుకు రూ.8.73 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. వనపర్తి మండలం చెరువు ముందరి తండా నుంచి పెద్ద తండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.2.40 కోట్లు, పెబ్బేరు మండలం కంచిరావుపల్లి నుంచి కంచిరావుపల్లి తండా

వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.2 కోట్లు, ఖిల్లా గణపురం మండలం కర్నేతండా నుంచి మేదిబావి తండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 3 కోట్లు, వనపర్తి మండలం పీడబ్ల్యూడీ రోడ్​ నుంచిచినగుంటపల్లి తండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.1.37 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఈ పనులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు.

Also Read : పేదలకు విద్య, వైద్యం అందించడమే లక్ష్యం : కసిరెడ్డి నారాయణరెడ్డి