ఉచిత అంబులెన్స్​ను ఉపయోగించుకోవాలి : తలసాని శ్రీనివాస్​ యాదవ్​

  • ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్​ యాదవ్​

సికింద్రాబాద్​, వెలుగు : ఉచిత అంబులెన్స్​లను ఉపయోగించుకోవాలని  సనత్ నగర్ ఎమ్మెల్యే  తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన క్యాంప్ ఆఫీస్​ వద్ద సనత్ నగర్ కు చెందిన కిద్మత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో   అంబులెన్స్ ను జెండా ఊపి ప్రారంభించారు.  

సనత్ నగర్ డివిజన్ ప్రజలు అత్యవసర పరిస్థితులలో అంబులెన్స్ సేవల కోసం 8096188429 నెంబర్ ను సంప్రదించాలని చెప్పారు.  కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు నిస్సార్ అహ్మద్, సయ్యద్ అఖిల్, మైనార్టీ నాయకులు జమీర్, నోమాన్, వసీం, ఇలియాస్ పాల్గొన్నారు.