హత్నూర రైతువేదికలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే సునీతా రెడ్డి

సంగారెడ్డి (హత్నూర), వెలుగు: ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మెల్యే సునీతా రెడ్డి అన్నారు. మంగళవారం హత్నూర రైతువేదికలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడపడుచులకు అండగా నిలిచేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని ప్రారంభించిందని గుర్తు చేశారు. 

కార్యక్రమంలో డీటీ దావూద్, ఆర్ఐ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ నర్సింలు, లేబర్ వెల్ఫేర్ బోర్డ్ మాజీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, కాసాల పీఏసీఎస్​ చైర్మన్ దామోదర్ రెడ్డి, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ కిషోర్, నాయకులు పాల్గొన్నారు.