స్కిల్ డెవలప్​మెంట్ కోర్సులకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది : ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి

  • పాలమూరుకు స్కిల్ డెవలప్​మెంట్ సెంటర్ 

పాలమూరు వెలుగు: స్కిల్ డెవలప్​మెంట్ కోర్సులకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందని, ప్రైవేటు రంగంలో ప్రతిభ తగ్గ అవకాశాలు ఎన్నో ఉన్నాయని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్​నగర్​లోని ప్రభుత్వ ఒకేషనల్​ జూనియర్ కాలేజీలో గురువారం నిర్వహించిన అప్రెంటిస్ మేళకు ఆయన హాజరయ్యారు.

పదేండ్ల బీఆర్​ఎస్ పాలనలో విద్య, వైద్యాన్ని మరుగున పడాశాని మండిపడ్డారు. రానున్న రోజుల్లో  మహబూబ్ నగర్ కు స్కిల్ డెవలప్​మెంట్ సెంటర్  అందుబాటులో వస్తుందని, ఇది ఆరంభం మాత్రమేనని చెప్పారు. కార్యక్రమంలో ఆయా జిల్లాల డీఈఈవోలు శ్రీధర్ సుమన్, రాధారాణి , సుదర్శన్, రమేశ్, కాజేజీ ప్రిన్సిపాల్ గోపాల్ పాల్గొన్నారు.