రైతులకు మేలు చేయడమే లక్ష్యం : చిక్కుడు వంశీకృష్ణ

వంగూరు, వెలుగు: రైతులకు మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్​ జిన్నింగ్ మిల్లును రాష్ట్ర వ్యవసాయ కమిషన్  మెంబర్  కేవీఎన్ రెడ్డి, సీఎం సోదరుడు ఎనుముల కృష్ణారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో రాష్ట్రంలో రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. 

పత్తిని కొనుగోలు చేసేందుకు సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రైతులు మధ్య దళారులను ఆశ్రయించి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయించి మద్దతు ధర పొందాలని  సూచించారు. పంట నష్టపోయిన నియోజకవర్గంలో రైతులకు రూ.9.36 కోట్లు పరిహారం అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పండిత్ రావు, పాండురంగారెడ్డి, లాలు యాదవ్, వేమారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, శేఖర్, చందు యాదవ్, ఎస్ఐ మహేందర్ పాల్గొన్నారు.