జూకల్ లో లైబ్రరీని ప్రారంభించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి

నారాయణ్ ఖేడ్, వెలుగు: మండలంలోని జూకల్ శివారులో గల ప్రభుత్వ మోడల్ డిగ్రీ కాలేజీలో సర్వోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైబ్రరీని శుక్రవారం ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్టూడెంట్స్ పుస్తకాలు చదవడం అలవాటుగా మార్చుకోవాలన్నారు. త్వరలోనే కాలేజీలో పీజీ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్, కౌన్సిలర్ వివేకానంద, శంకర్, ఇన్​చార్జి ప్రిన్సిపాల్ రమేశ్, కాలేజీ స్టాఫ్ పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాలు ప్రారంభం 

పెద్దశంకరంపేట: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. మండల పరిధిలోని శివాయపల్లి, వీరోజిపల్లి, బూర్గుపల్లి, జమ్మికుంటలో ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అనంతరం కేజీవీబీని పరిశీలించి విద్యార్థినుల సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తానన్నారు.

కార్యక్రమంలో తహసీల్దార్ గ్రేసీ బాయ్, ఎంపీడీవో రఫిక్ ఉన్నిసా, ఆర్ఐ శరణప్ప, ఐకేపీ ఏపీఎం గోపాల్, కాంగ్రెస్ నాయకులు నారాగౌడ్, సంగమేశ్వర్, సంతోష్ కుమార్, రాములు, మహిళలు పాల్గొన్నారు.