- విద్యార్థుల సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్, వెలుగు: ఖేడ్ పట్టణ శివారులోని బీసీ గురుకులాన్ని శనివారం ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేయగా స్టూడెంట్స్పలు సమస్యలను విన్నవించారు. తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే అదే రోజు రాత్రి గురుకులం గ్రౌండ్‌లో హైమాస్ట్ లైట్లను ఫిట్చేయించారు. డైనింగ్‌హాల్‌లో 4 ఫ్యాన్లు, 8 ట్యూబులను ఏర్పాటు చేయించారు. చెడిపోయిన 80 ఫ్యాన్లను, ట్యూబులను త్వరలో రిపేర్చేయించి అందించాలని మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్‌ను ఆదేశించారు.
స్టూడెంట్స్ నీటిని వాడుకోవడానికి ఇబ్బందులు పడుతుండడంతో 2వేల లీటర్ల సామర్థ్యం గల రెండు ట్యాంకులను ఏర్పాటు చేయించారు. చెడిపోయిన ఆర్వో వాటర్ ప్లాంటును రిపేర్చేయించి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సమస్యలను స్వయంగా పరిశీలించి తక్షణమే పరిష్కరించడం పట్ల స్టూడెంట్స్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.