బీసీ వెల్ఫేర్ స్కూల్ తనిఖీ చేసిన ఎమ్మెల్యే

నారాయణ్. ఖేడ్, వెలుగు : నిజాంపేట మండల పరిధిలోని బాచెపల్లి మహాత్మ జ్యోతిబాపూలే స్కూల్ ను ఎమ్మెల్యే సంజీవరెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టూడెంట్స్ కు మెనూ ప్రకారం భోజనం పెట్టాలన్నారు. 

పౌష్టికాహారంతో కూడిన మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్ అందించాలన్నారు. అనంతరం వివిధ క్లాస్ రూమ్ లలో తిరుగుతూ స్టూడెంట్స్ ను పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, టీచర్లు, స్టూడెంట్స్ ఉన్నారు.