నారాయణ్ ఖేడ్, వెలుగు: ఖేడ్ మండల పరిధిలోని జూకల్శివారులో గల శంకరంపేట మహాత్మ జ్యోతిబాపూలే స్కూల్ ను ఎమ్మెల్యే సంజీవరెడ్డి శనివారం తనిఖీ చేశారు. హాస్టల్ పరిసరాలు, డార్మెటరీ, టాయిలెట్స్ లను చెక్‌చేసి తగు సూచనలు అందించారు. హాస్టల్ లో పాడైపోయిన ఆర్వో ప్లాంట్ ను వెంటనే రిపేర్చేయించాలని అధికారులను ఆదేశించారు. స్కూల్ సమస్యలపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని ఫోన్ ద్వారా ఆర్సీవో సంతోషికి సూచించారు. స్టూడెంట్స్ కు క్వాలిటీ చదువుతో పాటు మెనూ ప్రకారం భోజనం పెట్టాలన్నారు.
కాగా బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాల టైమింగ్స్ 9:00 నుంచి 4:30 వరకు మార్చేందుకు చర్యలు తీసుకోవాలని టీచర్స్ కోరగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్తానన్నారు.అనంతరం స్టూడెంట్స్ తో కలిసి భోజనం చేశారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్, రమేశ్ చౌహాన్, రామకృష్ణ, సయ్యద్, వివేకానంద, రాజేశ్ చౌహాన్, శంకర్ ముదిరాజ్ ఉన్నారు.