నారాయణ్ ఖేడ్ లో ఆర్టీఏ ఆఫీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి

నారాయణ్ ఖేడ్, వెలుగు: ఖేడ్ పట్టణంలోని రైతు బజార్ లో గురువారం ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆర్టీఏ ఆఫీస్ ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్సు, వాహన రిజిస్ట్రేషన్లు, బీమా, ఫిట్​నెస్​వంటి సేవల కోసం ఇకనుంచి జహీరాబాద్​కు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. వారంలో రెండు రోజుల పాటు ఇక్కడ సేవలందించాలని మంత్రి పొన్నంప్రభాకర్ ను కోరగా అందుకు ఆయన వెంటనే ఉన్నతాధికారులకు ఆదేశించారని చెప్పారు. 

ఈ మేరకు బుధ, గురువారాల్లో ఇక్కడే సేవలు అందస్తారని తెలిపారు. త్వరలో ఇక్కడ శాశ్వతంగా సేవలు అందించేలా ఎంబీఐ ఆఫీసును మంజూరు చేయిస్తామన్నారు. కార్యక్రమంలో రవాణా శాఖ ఉప కమిషనర్ వెంకటరమణ, ఎంవీఐ వెంకటయ్య, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, వైస్ చైర్మన్ ధరన్ శంకర్, కౌన్సిలర్లు వివేకానంద్, మాజీద్, నర్సింహులు, రామకృష్ణ, సద్దాం, హన్మాండ్లు, తాహెర్అలీ, నర్సింహారెడ్డి, అశోక్ రెడ్డి పాల్గొన్నారు.