నారాయణ్ ఖేడ్,వెలుగు: సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గం వెనుకబడిందని ప్రభుత్వ పథకాల అమలులో ఖేడ్ కు ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ఆదివారం ఆయన నివాసంలో సీఎంని మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఖేడ్ నియోజకవర్గానికి మొదటి విడతలోనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఐటీఐ కాలేజ్, స్కిల్ డెవలప్మెంట్సెంటర్, ఇండోర్, ఔట్‌డోర్ స్టేడియాలను మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు.