నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో పేదలకు మెరుగైన వైద్యం అందించాలి : సంజీవరెడ్డి

నారాయణ్ ఖేడ్, వెలుగు: నియోజకవర్గంలోని పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి వైద్య సిబ్బందికి సూచించారు. సోమవారం సిర్గాపూర్ మండలంలో అంబులెన్స్ సర్వీస్ ప్రారంభించిన అనంతరం ఏరియా హాస్పిటల్ అభివృద్ధి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. హాస్పిటల్​లో ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే మంత్రి దామోదర సహకారంతో పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం కేక్ కట్ సిబ్బందికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ రమేశ్, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

కొత్త బైపాస్ రోడ్డు పనులు ప్రారంభం

ఖేడ్ మున్సిపల్ పట్టణ పరిధిలోని కాంజీపూర్ రోడ్డు నుంచి వేంకటేశ్వర ఆలయం, ఆర్టీసీ బస్సు డిపో, డీఎస్పీ ఆఫీస్ మీదుగా నిజాంపేట్ రోడ్డును కలిపే బైపాస్ రోడ్డు పనులను ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణం వల్ల ఖేడ్ పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయన్నారు. రోడ్డు కోసం భూమిని ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, మండలాధ్యక్షుడు తాహెర్, రమేశ్ చౌహాన్, పండరి రెడ్డి, ముంతాజ్ పాల్గొన్నారు.