ఖేడ్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా : ఎమ్మెల్యే సంజీవరెడ్డి

నారాయణ్ ఖేడ్, వెలుగు : ఖేడ్ ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. గురువారం ఖేడ్ పట్టణంలోని ఒకటో వార్డులో ఫార్మేషన్ రోడ్డు ఏర్పాటు పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ రోడ్డు నిర్మాణంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందన్నారు. ఇటీవల టీయూఐఎఫ్డీ ద్వారా రూ.20 కోట్లతో డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించామని తెలిపారు.

కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప షెట్కర్, వైస్ చైర్మన్ దారం శంకర్, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, కాంగ్రెస్ లీడర్లు రమేశ్ చౌహాన్, హనుమాండ్లు, రాజేశ్ చౌహన్, రామకృష్ణ, వివేకానంద, సద్దాం, సయ్యద్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.