పెద్ద శంకరంపేట, వెలుగు: విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు కాంగ్రెస్ ప్రభుత్వంపెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చీలపల్లి, ఉత్తలూరు, రామోజీపల్లి, జూకల్, పెద్ద శంకరంపేటలో రూ.3.10 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇప్పటికే రెండు లక్షల రుణమాఫీ చేశామని, త్వరలో రైతు భరోసా కింద బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పారు.
అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేశ్ షెట్కార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మధు, నారాగౌడ్, సంతోష్ కుమార్, రాజన్ గౌడ్, సత్యనారాయణ, సంగమేశ్వర్, రాజు, సుభాష్ గౌడ్, గంగారెడ్డి, పున్నయ్య, లక్ష్మణ్ పాల్గొన్నారు.
సైన్స్ ల్యాబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే
నారాయణ్ ఖేడ్: ఖేడ్ నియోజకవర్గం నాగలిగిద్ద మండలంలోని కారాముంగిలో కొత్తగా ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్ బిల్డింగ్‌ను ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ల్యాబ్ ను ప్రాక్టికల్స్ కోసం ఉపయోగించుకొని నాలెడ్జ్ పెంచుకోవాలని సూచించారు. ఆయన వెంట స్థానిక కాంగ్రెస్నాయకులు ఉన్నారు.