క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట : సంజీవరెడ్డి

  • ఎమ్మెల్యే సంజీవరెడ్డి

నారాయణ్ ఖేడ్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని, గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.364 కోట్లను క్రీడా శాఖకు కేటాయించడం గొప్ప విషయమని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. సోమవారం జూకల్ శివారులోని సోషల్ వెల్ఫేర్ స్కూల్​లో స్టేట్ లెవెల్ జోనల్ మీట్ గేమ్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాకు స్పోర్ట్ యూనివర్సిటీ,  ఖేడ్ నియోజకవర్గంలో ఇండోర్, ఔట్​డోర్ స్టేడియాలు నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.

 గ్రామీణ స్థాయి క్రీడాకారులను వెలికి తీసేందుకు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ నిర్వహించబోతున్నట్లు చెప్పారు. తెలంగాణ నుంచి ఒలంపిక్స్ వంటి పోటీలకు క్రీడాకారులు ఎంపిక కావాలంటే గ్రామ స్థాయిలోనే టాలెంట్ గుర్తించడం అవసరమని పేర్కొన్నారు. స్టూడెంట్స్​వ్యసనాలను బానిస కాకుండా విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అంతకుముందు ఎమ్మెల్యే సంజీవరెడ్డి, అనుపమ దంపతులు కార్తీక మాసం పురస్కరించుకొని తమ ఇంట్లో శివపంచాక్షర జపయజ్ఞం, శ్రీ గురుపాదుకార్చన కార్యక్రమాలను నిర్వహించారు. 

జ్యోతిర్వాస్తు విద్యా పీఠం వ్యవస్థాపకుడు మహేశ్వర శర్మ సిద్ధాంతి, మలమంచి మోహన్ జోషి వైదిక పర్యవేక్షణలో పూజలు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్, రమేశ్ చౌహాన్, శంకర్, పల్లవి, టీచర్లు, స్టూడెంట్స్ పాల్గొన్నారు.