చివరి ఆయకట్టుకు నీరందిస్తాం : ఎమ్మెల్యే సంజీవరెడ్డి

  • నల్లవాగు నీటి విడుదల చేసిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి  

నారాయణ్ ఖేడ్, వెలుగు: నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు వరకు సాగు నీరందిస్తామని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లాలోని ఏకైక మధ్యధర ప్రాజెక్టు అయిన నల్లవాగు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లవాగు నీటి ద్వారా 4 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నల్లవాగు ప్రాజెక్టును పట్టించుకోలేదని ఆరోపించారు.

 రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. అనంతరం క్యాంప్​ఆఫీసులో సిర్గాపూర్, మనూరు మండలాల లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. రాబోయే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు సూచించారు.  

టీచర్ వృత్తి అత్యంత పవిత్రమైనది

టీచర్ వృత్తి అత్యంత పవిత్రమైనదని ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. ఖేడ్ పట్టణంలోని సాయిబాబా ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన టీఎస్ యూటీఎఫ్ ఆరో విద్యా మహాసభను ప్రారంభించి మాట్లాడారు. సమాజాభివృద్ధిలో టీచర్ల పాత్ర ఎంతో కీలకమని, స్టూడెంట్స్​ను శక్తివంతులుగా తయారు చేసే బాధ్యత టీచర్లపైనే ఉందన్నారు. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం టీచర్ల సమస్యలను పెండింగ్​లో పెట్టిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీచర్ల సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు.  కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ,  ప్రొఫెసర్ నాగేశ్వరరావు, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర, జిల్లా నాయకులు, టీచర్లు పాల్గొన్నారు.