జగన్ బర్త్ డేకు గిఫ్ట్ రెడీ చేసిన రోజా

జగన్ బర్త్ డేకు గిఫ్ట్ రెడీ చేసిన రోజా
పేద అమ్మాయిని దత్తత తీసుకున్నట్లు ప్రకటన చిత్తూరు: నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఏపీ సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్ డేకు స్పెషల్ గిఫ్ట్ ను రెడీ చేసుకుంది. రేపు సోమవారం జగన్ బర్త్ డే ను పురస్కరించుకుని ఏపీఐఐసీ చైర్మన్ గా ఉన్న  ఎమ్మెల్యే రోజా వినూత్న సేవ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా  ఓ పేద అమ్మాయిని వైద్య విద్యను చదివించేందుకు ఎమ్మెల్యే రోజా పూనుకున్నారు. తల్లి, తండ్రి ఇద్దరినీ కోల్పోయిన పుష్ప కుమారి డాక్టర్ కోర్సు చదివించే బాధ్యతను రోజా తీసుకున్నారు. ఈనెల 8వ తేదీన నగరి ఎమ్మెల్యే రోజా తిరుపతి గర్ల్స్ హోమ్ ను సందర్శించిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. హోమ్ ను సందర్శించినప్పుడు అక్కడి టీచర్లు, విద్యార్థులతో రోజా స్వయంగా మాట్లాడి అందరి వివరాలు తెలుసుకున్నారు. నీట్ లో ర్యాంక్ వచ్చా ఆర్థిక స్తోమత లేక చదువు కొనసాగించలేని పరిస్థితిలో ఉన్న పుష్ప కుమారి అనే బాలిక గురించి తెలుసుకుని తానే స్వయంగా పూర్తి బాధ్యతతో దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. సీఎం జగన్ పుట్టిన రోజు నాడు శుభ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న సందర్భంగా ఓ పేద ఆడబిడ్డను డాక్టర్ చదివించేలా దత్తత తీసుకుంటానని లిఖితపూర్వకంగా హోం నిర్వాహకులకు తెలియజేశారు.  రేపు జగన్ బర్త్ డే సందర్భంగా రోజా తీసుకున్న నిర్ణయం గురించి సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో.. రోజా పై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలోనే కాదు.. ఇంటా బయటా.. అన్ని చోట్లా రోజాకు అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు.   తిరుపతి బాలికల హోమ్ లో ఎమ్మెల్యే రోజా రాసిన లేఖ ..