బాధితులకు అండగా ఉంటాం

  • ఎమ్మెల్యే రోహిత్ రావు

మెదక్​టౌన్, వెలుగు: నియోజకవర్గంలో వర్షాలతో నష్టపోయిన బాధితులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే రోహిత్​రావు తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన నష్టాలను అంచనా వేసి ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందజేస్తామని పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ రాహుల్ రాజ్ తో కలిసి హవేళీ ఘనపూర్​మండలం ధూప్​సింగ్​ తండా వద్ద కోతకు గురైన బ్రిడ్జిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కోతకు గురైన బ్రిడ్జ్ పనులను వేగంగా పూర్తిచేస్తామన్నారు.

దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని పంచాయతీరాజ్ ఈఈ నర్సింలును  ఆదేశించారు. కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. ఆస్తి, పంట  నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ నవీన్, పీఆర్​ఈఈ నర్సింలు, డీఈ  పాండురంగారావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.