- ఎమ్మెల్యే రోహిత్ రావు
పాపన్నపేట, వెలుగు: మాదిగ, మాదిగ ఉప కులాలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. సోమవారం కొత్తపల్లిలో ఎమ్మార్పీఎస్ నాయకుడు అల్లారం రత్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన మాదిగ, మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మాదిగల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రత్నయ్య మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రోహిత్ రావు అండగా ఉంటే తాము ఎల్లవేళలా వారి వెంట ఉంటామని వెల్లడించారు.
కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గోవింద్‌నాయక్, కిసాన్ సెల్జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్‌జిల్లా నాయకులు ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, మాజీ కో అప్షన్మెంబర్గౌస్, నరేందర్‌గౌడ్, బాల్‌రాజ్, ప్రవీణ్‌గౌడ్ పాల్గొన్నారు.