పేదింటి ఆడ పిల్లలకు కల్యాణలక్ష్మీ వరం : ఎమ్మెల్యే రోహిత్

  • రూ.1.68 కోట్ల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రోహిత్ 

మెదక్, వెలుగు: కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు వరం లాంటివని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. శుక్రవారం చిన్నశంకరంపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు రూ.1.68 కోట్ల చెక్కులను, రూ.6 లక్షల విలువైన సీఎంఆర్​ఎఫ్​ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాటల్లో కాకుండా చేతల్లో అభివృద్ధి చేసే ప్రభుత్వం తమదన్నారు. ధాన్యం కొనుగోలు వేగంగా జరుగుతుందని, సన్న వడ్లకు రూ.500 బోనస్ మంజూరు చేస్తున్నామని తెలిపారు.

జిల్లాలో ఈరోజు జరిగిన ప్రమాదం దురదృష్టకరమని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ, రాజిరెడ్డి, నరేందర్, రమేశ్ గౌడ్, జీవన్, భిక్షపతి, రాజశేఖర్, శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

శ్రామిక జీవనానికి ప్రతిరూపం గిరిజనులు

పాపన్నపేట: జీవనానికి ప్రతిరూపం గిరిజనులని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. మండల పరిధిలోని మొదల్లకుంట తండాలో జరిగిన దనరా ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట జగదంబికా మాత, సేవాలాల్ మహరాజ్ ఆలయాల్లో పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దివంగత ప్రధాని ఇందిరా గాంధీకి గిరిజనులంటే అమిత మైన ప్రేమ అన్నారు.ఆమె హయాంలో గిరిజనుల కోసం అనేక పథకాలు అమలులోకి తీసుకొచ్చారన్నారు. 

విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంట్ ఎందుకు పోయిందో కారణం తెలపాలని ఏఈని ఆదేశించారు. బాచారంలో ఈ నెల 24 నుంచి జరిగే ఉర్సుకు సంబంధించి విద్యుత్ పోల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. 

ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మండల కాంగ్రెస్ ఆధ్యక్షులు గోవింద్ నాయక్, జిల్లా అధికార ప్రతినిధి శ్రీ కాంతప్ప, గౌస్, శ్రీనివాస్, నరేందర్ గౌడ్, నర్సింలు, ఇంద్రసేనారెడ్డి, శ్రీమాన్ రెడ్డి ఉన్నారు.