నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా : ఎమ్మెల్యే రోహిత్ రావు

  • ఎమ్మెల్యే రోహిత్ రావు 

రామాయంపేట, వెలుగు: మెదక్ నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. రామాయంపేట ఎస్సీ కాలనీలో ఐకేపీ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం తొనిగండ్ల,లక్ష్మా పూర్ లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. 

అక్కడి నుంచి దంతెపల్లి చేరుకుని చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సుప్రభాత రావు, రమేశ్ రెడ్డి, యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రం, సీఈ వో నర్సింలు ఉన్నారు.