స్టూడెంట్స్ ​ఇష్ట ప్రకారమే మెనూ : రోహిత్​రావు

  • ఎమ్మెల్యే రోహిత్​రావు

మెదక్​టౌన్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం స్టూడెంట్స్​ఇష్ట ప్రకారమే మెనూ రూపొందించిందని ఎమ్మెల్యే రోహిత్​రావు అన్నారు. శనివారం మెదక్ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల స్కూల్​, కాలేజీలో డైట్ మెనూ ఆవిష్కరించి స్టూడెంట్స్​తో కలిసి భోజనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్టూడెంట్స్​కు విద్యతో పాటు పోషకాహారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో పిల్లల చదువును ఆపరాదని సూచించారు. 

స్కూల్, కాలేజీలోని క్లాస్​రూమ్స్​,  వంట గది, కూరగాయలు, సరుకులను పరిశీలించి  నిర్వాహకులను అభినందించారు. అంతకుముందు కొత్త డైట్ మెనూ బోర్డును స్టూడెంట్స్​తల్లిదండ్రులు, టీచర్లతో కలిసి ఆవిష్కరించారు. అలాగే ఎస్​వోపీ హ్యాండ్ బుక్ ను విడుదల చేశారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకుల స్కూల్​, కాలేజీ ఇన్​చార్జి ప్రిన్సిపాల్ పద్మావతి,  ప్రజాప్రతినిధులు, టీచర్లు, పేరెంట్స్​, స్టూడెంట్స్​ పాల్గొన్నారు.

 ఏడుపాయలను పర్యాటక కేంద్రంగా మారుస్తా..

పాపన్నపేట: ఏడుపాయల పుణ్య క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తానని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. శనివారం ఆయన ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయాన్ని సందర్శించి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ అర్చకులు ఎమ్మెల్యే రోహిత్​రావుకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈవో చంద్రశేఖర్ ఆలయ మర్యాదల ప్రకారం శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏడుపాయల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరామన్నారు.

ఏడుపాయలను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తా మన్నారు. భక్తులకు అవసరమైన సత్రాలు నిర్మిస్తామని చెప్పారు. డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు, తాగునీరు, ఘనపురం ప్రాజెక్టు ఆధునీకరణ చేస్తామని తెలిపారు. ప్రశాంత్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నరేందర్​గౌడ్, నర్సింలు, ఇంద్రసేనా రెడ్డి, భరత్​గౌడ్​పాల్గొన్నారు.