48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు : ఎమ్మెల్యే రోహిత్​రావు

  • ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే రోహిత్​రావు

మెదక్​ టౌన్​, రామాయంపేట, వెలుగు : రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు వారి ఖాతాల్లో పడతాయని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. బుధవారం రామాయంపేట మండలం అక్కన్నపేటలో, హవేళీ ఘనపూర్​ మండలం పాతూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  రోహిత్​ రావు మాట్లాడుతూ... రైతే దేశానికి వెన్నెముక అనే నినాదంతో  ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తోందని... జిల్లా వ్యాప్తంగా 473 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.  మెదక్​ జిల్లా అడిషనల్​ కలెక్టర్​ వెంకటేశ్వర్లు, డీఆర్​డీవో పీడీ శ్రీనివాస్​రావు, తహశీల్దార్​ రజని, ఏపీవోలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.