కొనుగోలు సెంటర్​ను ప్రారంభించిన ఎమ్మెల్యే : రోహిత్ రావు

నిజాంపేట, వెలుగు: సన్న వడ్లకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తూ ధాన్యం కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని నార్లాపూర్ లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సెంటర్ ను ఆయన ప్రారంభించారు. గ్రామంలో హెల్త్​ సబ్​సెంటర్​, జీపీ కొత్త బిల్డింగ్, మహిళ సమైక్య బిల్డింగ్, సీసీ రోడ్లను నిర్మించేందుకు నిధులు  మంజూరు చేయాలని కోరుతూ మాజీ సర్పంచ్ అమరసేనా రెడ్డి ఎమ్మెల్యే కు వినతిపత్రాన్ని అందజేశారు.

 స్పందించిన ఎమ్మెల్యే నార్లాపూర్ గ్రామంలో సమస్యలను తీర్చడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎపీఎం రాములు, సీసీ లక్ష్మీ, కాంగ్రెస్ నాయకులు మహేందర్, నసీరుద్దిన్, మారుతి, రవీందర్ రెడ్డి, రాములు, మహేశ్, నర్సింలు పాల్గొన్నారు.