ఏడాదిలోనే పదేళ్ల డెవలప్​మెంట్ : ఎమ్మెల్యే రోహిత్ రావు

నిజాంపేట, వెలుగు : మండలంలో పదేళ్లలో జరగని డెవలప్​మెంట్​కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే జరిగిందని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. సోమవారం ఆయన మండలంలోని ఖాసీంపూర్ తండా నుంచి తిప్పనగుళ్లకు వెళ్లే రోడ్డు, ,షౌకత్ పల్లి వడ్డెర కాలనీ నుంచి బచ్చురాజ్ పల్లి క్రాసింగ్ వరకు వెళ్లే బీటీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలానికి పలు ఫండ్స్ కేటాయిస్తూ సీసీ రోడ్లు

బీటీ రోడ్లు వేసుకుంటూ అన్ని రంగాల్లో నిజాంపేట ను ముందుకు తీసుకువెళ్తున్నట్ల పేర్కొన్నారు. కార్యక్రమంలో అర్ అండ్ బీఈఈ సర్ధార్ సింగ్, ఏఈ విజయ సారథి, ఎంపీడీవో రాజిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు అమరసేనారెడ్డి, లింగం గౌడ్, మారుతి, సిద్ధరాములు, విఠల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.