పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

జడ్చర్ల టౌన్, వెలుగు:  జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని పంచాయతీరాజ్ అధికారులతో ఎమ్మెల్యే అనిరుధ్​ రెడ్డి గురువారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలానగర్ -,  గంగాపూర్ తో పాటు నియోజకవర్గ పరిధిలో పలు రహదారులు మంజూరయ్యాయని వెల్లడించారు.   

నియోజకవర్గంలోని చెక్ డ్యాం ల నిర్మాణాల కోసం రూ. 50 కోట్లు  మంజూరు అయ్యాయని వివరించారు. జడ్చర్ల కు తాను బైపాస్ రోడ్డు తీసుకువస్తానని చెప్పారు.   అనంతరం  పట్టణంలోని ప్రభుత్వ   పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ  మాత్రలు వేశారు,   పాఠ్య  పుస్తకాలు,  యూనిఫాంలు అందజేశారు.