రైతులకు సంక్షేమ పథకాలు అందిస్తాం :  ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: రైతులకు సంక్షేమ పథకాలను అందజేస్తామని ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి తెలిపారు. సోమవారం తాడూరు పీఏసీఎస్​ కొత్త భవనాన్ని డీసీసీబీ చైర్మన్  విష్ణువర్ధన్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.

గత ప్రభుత్వం తమ పార్టీకి అనుకూలమైన వారికే లబ్ధి చేకూర్చేదని, కాంగ్రెస్  ప్రభుత్వం రాజకీయాలకతీతంగా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తుందని చెప్పారు. నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్  విద్యాలయాన్ని ప్రభుత్వం మంజూరు చేసిందని, నాగర్ కర్నూల్  అర్బన్  డెవలప్​మెంట్  అథారిటీ పరిధిలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. అనంతరం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్  చెక్కులను అందజేశారు. పాత కలెక్టరేట్  ఆవరణలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను అడిషనల్  కలెక్టర్  దేవ సహాయంతో కలిసి  ప్రారంభించారు.