సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ఏపీ డిప్యూటీ స్పీకర్‎గా ఎమ్మెల్యే ఆర్ఆర్ఆర్

సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‎ పదవికి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు (ఆర్ఆర్ఆర్) పేరును ఖరారు చేశారు. ఎన్డీఏ కూటమి డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా పేరు కన్ఫామ్ కావడంతో రఘురామ కృష్ణరాజు నామినేషన్ దాఖలు చేయనునున్నారు. రఘురామ కృష్ణరాజుకు పోటీగా ఇతరులు నామినేషన్ వేయకపోతే.. డిప్యూటీ స్పీకర్‎గా ఆర్ఆర్ఆర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. 

ALSO READ | చీఫ్ విప్, విప్‎ల నియామకం.. ఏపీ అసెంబ్లీ చీఫ్ విప్‎గా జీవీ ఆంజనేయులు

ప్రస్తుతం అసెంబ్లీలో ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజార్టీ ఉండటంతో వైసీపీ డిప్యూటీ స్పీకర్‎ ఎన్నికకు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‎గా ఆర్ఆర్ఆర్ ఎన్నిక లాంఛనం కానుంది. కాగా, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రఘురామకృష్ణ రాజు వైసీసీకి రాజీనామా చేసి.. ఎన్డీఏ కూటమిలో చేరిన విషయం తెలిసిందే. ఉండి అసెంబ్లీ స్థానం నుండి కూటమిగా అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆర్ఆర్ఆర్ వైసీపీ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు.